ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైనా ఓవర్లలో కోత విధించలేదు. భారత జట్టు నలుగురు పేసర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతోంది. వాతావరణం మేఘావృతంగా ఉండటంతోనే బౌలింగ్ ఎంచుకున్నామని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.