బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను కోస్తాంధ్ర వైపు వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె మార్గాల్లో పలు రైళ్లను సోమ, మంగళవారాల్లో రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా రద్దు చేసి, కొన్నింటిని మళ్లించారు. స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు, ట్రాక్‌ల వద్ద ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను సిద్ధం చేశారు.