బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువజాము మధ్య ఒంగోలు వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో గంటకు 120 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తాయి. పశ్చిమగోదావరి, బాపట్ల, నెల్లూరు సహా ఎనిమిది జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.