ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే రహదారిపై నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వేకువజామున కారు అదుపుతప్పి వాటర్ పైప్‌లైన్ వాల్వ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హయత్‌నగర్‌కు చెందిన డ్రైవర్ వినీత్ (24) అక్కడికక్కడే మరణించాడు. నీరు ఎగసిపడి రోడ్డు జలమయమవ్వడంతో అధికారులు సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.