ఎల్నినో కారణంగా వర్షాభావం వల్ల పంటలు ఎండిపోవడంతో రైతులు నష్టంలో ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ పంటల దిగుబడిని పెంచేందుకు ఆరుతడి పంటల సాగు, నూనెగింజలు, పప్పు, కూరగాయల సాగు ప్రోత్సహించేందుకు రూ.224 కోట్ల విత్తన రాయితీ, రూ.296.88 కోట్ల ఉద్యాన పంటల ప్రోత్సాహం అందించాలనుకుంటుంది.