పండుగ సమయంలో హైదరాబాద్ జలమండలి హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్‑2 పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌కు కార్ ఢీకొట్టడంతో లీకేజీ ఏర్పడింది. బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, రామంతాపూర్, ఉప్పల్, బేగంపేట, ప్రకాశ్ నగర్, పద్మారావునగర్, సికింద్రాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, మీర్‌పేట, బడంగ్‌పేట, బాలాపూర్ వంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోవచ్చు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.