ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన 3,500 మందికి పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు బొత్స చిన్న శ్రీను ఆధ్వర్యంలో ఈ భారీ చేరికలు జరిగాయి. దీంతో వైకాపాకు ఈ నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.