బియ్యాన్ని రెండు సార్లు కడిగి, 5–10 నిమిషాలు నానబెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత బిర్యానీ ఆకులు, స్టార్ ఎనైస్, జాపత్రి, బగార పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీడిపప్పు పలుకులు, షాజీరా వేసి వేయించాలి. పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటా వేసి, టమాటా మెత్తబడే వరకు వేయించాలి. పసుపు, ఉప్పు, ధనియాల పొడి కలిపి, ఎర్ర గోంగూర ఆకులు వేసి, చివరగా నీరు వేసి పులావ్ వండాలి.
ఆంధ్రా స్టైల్ గోంగూర పులావ్ – ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలి
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24