భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటలకు ఇండోర్ లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రి జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.