టీ20లలో భారత జట్టు మేనేజ్‌మెంట్ పదేపదే ఓపెనింగ్ కాంబినేషన్ మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సంజు సామ్సన్, వైభవ్ సూర్యవంశీల ఆత్మవిశ్వాసం దెబ్బతిందని మాజీ కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. భారత్ వద్ద అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, వైభవ్ సూర్యవంశీలతో సహా పలు ఓపెనింగ్ ఎంపికలు ఉన్నాయి.