ఇందోర్ వేదికగా జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 69 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 209 పరుగులకే పరిమితం అయింది.