వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే వారం రోజుల్లో ఆగ్నేయ, తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, అది వాయవ్య దిశగా కదులుతూ బలపడుతుంది. అందువల్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో పడవచ్చు. ఉత్తరాంధ్రలోని ద్రోణి ప్రభావంతో బుధవారం పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా.