చిన్న మొత్తాల పొదుపు కోసం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఉపయోగపడుతుంది. ఉద్యోగులు, మధ్యతరగతి వారు నెలకు కొంత మొత్తం చొప్పున ఐదేళ్లు అంటే 60 నెలల పాటు ఇందులో జమ చేయవచ్చు. ఈ పథకంలో నెలకు రూ.3,000 పొదుపు చేయడం ద్వారా ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షలకు పైగా మొత్తం చేతికందుతుంది.