ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.23,038 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి అని బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,43,796 కోట్లకు చేరింది. స్థూల ఎన్‌పీఏలు 1.39 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.36 శాతానికి తగ్గాయని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.