ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో గెలిచింది. కోహ్లీ 74 రన్స్, అర్ష్‌దీప్ నాలుగు వికెట్లు తీసినా అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కాంబోజ్ 10 ఓవర్లలో 22 పరుగులిచ్చి శాంట్నర్, స్మిత్ వికెట్లను పడగొట్టాడు. 46 డాట్ బంతులు వేసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.