ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. వర్షం పడటంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ, బ్యాట్ తడవకుండా తన షర్టు లోపల దాచుకున్నాడు. ఈ సమయంలో అతడు బ్యాట్ పట్ల తీసుకున్న శ్రద్ధకు సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.