వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 17న దుండగులు 18 మంది అభ్యర్థుల 19 నామినేషన్ పత్రాలను చించేయడంతో కలెక్టర్ చెరకూరి శ్రీధర్ నివేదిక ఇచ్చారు. నోటీసుల తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే మళ్లీ నామినేషన్ వేశారు.