సోమాలియా తీరంలో 12 మంది సాయుధ దొంగలు హైజాక్ చేసిన ‘అజిని’ అనే ఇరాన్ ఫిషింగ్ నౌకను భారత నౌకాదళం విజయవంతంగా విడిపించింది. ముంబైకి 3,000 కిలోమీటర్ల దూరంలో 48 గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, అందులోని 20 మంది ఇరాన్ సిబ్బందిని కాపాడి నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంది.