జర్మనీలోని కొలోన్ నగరంలో ఒక ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట 16 ఏళ్ల బాలికను ఒక రోబోట్ అసభ్యంగా తాకింది. 1.2 మీటర్ల ఎత్తు ఉన్న ఎరుపు, బంగారు రంగు రోబోట్ ఆ బాలికను ఆలింగనం చేసుకుని అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఈ ఘటనను ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం చేయగా, పోలీసులు ఆ రోబోట్‌ను, దాని 16 ఏళ్ల యజమానిని మరియు 19 ఏళ్ల స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.