అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పాలటైన్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అక్టోబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో రైఫిల్, మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్, శ్వేతజాతి ఆధిపత్య పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అరోరా ప్రాంతంలోని హిందూ ప్రార్థనా మందిరంపై దాడి చేయడానికి అతను కుట్ర పన్నాడని అధికారులు తెలిపారు.