బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ డిస్కౌంట్ సేల్‌లో కేవలం ఐదు పౌండ్లకు (రూ.500) ఒక ఉంగరాన్ని కొనుగోలు చేసింది. తర్వాత నిపుణుల పరిశీలనలో అది 18 క్యారెట్ల బంగారు ఉంగరం, 3.02 క్యారెట్ల వజ్రం అని తేలింది. దీని అసలు విలువ సుమారు 15,000 పౌండ్లు (రూ.16 లక్షలకు పైగా) ఉంటుందని అంచనా వేశారు.