హోర్ముజ్ జలసంధిలో నికరగువా జెండా కలిగిన ఎంటీ పెట్రో డాల్ఫిన్ నౌకపై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ నౌకలోని 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఒమన్ రాయబార కార్యాలయం గాలింపు చర్యలు చేపడుతోంది. అలాగే మార్షల్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ వాల్దెరా నౌకపై కూడా క్షిపణి దాడి జరిగింది, అందులో ఉన్న 11 మంది భారతీయుల భద్రతపై ఆరా తీస్తున్నట్లు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.