ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు వి.ఆర్. నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ షెల్టర్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని 18 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.