మధిర వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, వైరా, కొణిజర్ల, వేంసూర్, పెనుబల్లి, బోనకల్, కల్లూరు, చింతకాని, ముదిగొండ మండలాల 575 ప్రభుత్వ పాఠశాలలు, 10 జూనియర్ కళాశాలలకు రోజూ వేడివేడి అల్పాహారం పంపిణీ అవుతోంది. 27,700 మంది విద్యార్థులకు ఇడ్లీ, పూరి, ఉప్మా, బోండా, దోశలతో పాటు వేడి పాలు అందజేస్తున్నారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మెనూ రూపొందించింది.