ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా 100 అర్బన్ లోకల్ బాడీస్‌కు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 30న ఫలితాలు వెలువడతాయి.