ఏపీ హైకోర్టులో చేబ్రోలు రవికుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు విడుదల చేసిన బీసీ రిజర్వేషన్ జీవోలను ఆయన సవాలు చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలు అమలు అయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ నెల 28న ఎన్నికలు జరపడానికి ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.