జర్మనీలోని బోచుమ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడితో సహా ముగ్గురు భారతీయులు సజీవ దహనం అయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అపార్ట్‌మెంట్‌కు కావాలనే నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తూ, అదే భవనంలో నివసిస్తున్న రొమేనియాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.