భారతదేశంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ద్వారా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమిలా జయపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఆమె ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నంగా అభివర్ణించారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో జరుగుతున్న శాంతియుత నిరసనలకు ఆమె తన మద్దతును ప్రకటించారు.