టోలీవుడ్‌లో ఒక సినిమా హిట్‌ అవుతుందా లేదా ఫ్లాప్‌ అవుతుందా అనేది ముందే ఊహించడం చాలా కష్టం. పెద్ద కాంబినేషన్లు, ఎంతో క్రేజ్ ఉన్న ప్రాజెక్టులు కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేవు. అయితే సినిమా నిర్మాణంలో పనిచేసేవారు ఫ్లాప్ సంకేతాలను షూటింగ్ సమయంలోనే పసిగడతారని సమాచారం.