విశాఖ జీవీఎంసీ మేయర్ పదవికి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావడంతో పలువురు నేతలు పక్కకు తప్పుకుంటున్నారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ సతీమణి లావణ్యతో పాటు డీవీ సుబ్బారావు కోడలు శర్వాణి రేసులో ఉన్నారు. గతంలో డీవీ సుబ్బారావు మేయర్ కావడంతో ఆయన కుటుంబం నుంచి మళ్లీ ఒకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.