రైళ్లు, స్టేషన్లలో స్పీకర్‌పై పెద్ద శబ్దంతో సంగీతం లేదా వీడియోలు ప్లే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ రైల్వే హెచ్చరించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఫిర్యాదు ఆధారంగా చర్యలు ఉంటాయని, అవసరమైతే జరిమానా విధించి రైలు నుంచి దించివేస్తామని స్పష్టం చేసింది.