వాతావరణ శాఖ ప్రకారం, తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.