ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చోరీ జరిగింది. గత నెల 30న ఆర్‌ఐసీయూ, చెస్ట్ వార్డుల నుంచి రెండు, టీబీ వార్డు నుంచి మరో రెండు కలిపి మొత్తం నాలుగు వెంటిలేటర్లు మాయమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు వీటిని సంచుల్లో తీసుకెళ్తుండగా సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ ఘటనపై రిమ్స్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న వైద్యులు, భద్రతా సిబ్బంది కలిపి 10 మందికి మెమోలు ఇచ్చారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు చోరీ
Adilabad

సంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24
