రాప్తాడులో విద్యార్థినిపై దాడిచేసి, పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. అయితే అతని కుడికాలుకు తీవ్ర గాయమై రక్త ప్రసరణ తగ్గిందని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కుడికాలును తొలగించాల్సి రావచ్చని వైద్యులు పేర్కొన్నారు.