ఉక్రెయిన్‌లో బుధవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో ఆరు లక్షల మంది పౌరులు విద్యుత్తు లేకుండా అంధకారంలో మగ్గుతున్నారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. మాస్కో ఉద్దేశపూర్వకంగానే తమ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుందని ఆయన విమర్శించారు.