తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.3 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.