శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి విజయనగరం మండల జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఫర్నీచర్, క్రీడా మైదానం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యత, సౌకర్యాలపై చర్చించారు.