రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో, గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో రెండు కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేసిన స్వర్ణాంధ్ర పార్క్‌ను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు, సీనియర్ సిటిజన్లకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని చెప్పారు.