కాలిఫోర్నియాలోని ఐ-80 హైవేపై ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ఉన్న 22 ఏళ్ల యువకుడు నిద్రపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఇద్దరు సోలానో సీహెచ్‌పీ అధికారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.