మెక్సికోలోని కెనాల్ 6 ఛానెల్‌లో ప్రసారమైన ‘ఎస్ షో’లో యాంకర్ ఎర్నెస్టో చవానా, స్టూడియోలో తిరుగుతున్న డ్రోన్‌ను కాలితో తన్నాడు. డ్రోన్ పైకి ఎగిరి కొలంబియా మోడల్, డ్యాన్సర్ ఇసబెల్లా రోజస్ ముఖానికి తగిలి ఆమెకు గాయం కలిగింది. ఆమెను స్టూడియో నుంచి తీసి వైద్య సహాయం అందించారు. నెటిజన్లు యాంకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.