జర్మనీలోని బోచుమ్ నగరంలోని హోస్ట్‌ఫెడ్‌ ప్రాంతంలో ఒక నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దీనిని హత్యగా అనుమానిస్తూ, అదే భవనంలో నివసిస్తున్న 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా వెల్లడించలేదు.