కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా సోటకనాల్ గ్రామానికి చెందిన రుగీ కుటుంబం 40 ఎకరాల్లో ఉల్లి సాగు చేసి కోటి రూపాయల దాకా ఆదాయం పొందింది. గత ఏడాది అధిక వర్షాలు, సరైన ధర లేక నష్టపోయినా అధైర్యపడకుండా మళ్లీ సాగు చేశారు. ప్రస్తుతం నాణ్యమైన దిగుబడి రావడంతో పంట కోత చివరి దశకు చేరింది.