పన్ను బకాయిలు ఉన్నప్పటికీ పీపీఎఫ్‌లోని డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. పీపీఎఫ్‌లో ఉన్నంతవరకే ఈ రక్షణ ఉంటుంది. అయితే ఆ నిధులను విత్ డ్రా చేసుకుని సేవింగ్స్ ఖాతాలో వేస్తే మాత్రం ఐటీ శాఖ వాటి నుంచి పన్నును వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది.