యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు, సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీలు వరుసగా మూడో రోజు క్షిపణి దాడులు చేశారు. సౌదీ కూటమి యెమెన్ రాజధాని సనాలోని చమురు సంస్థలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 14 మంది మరణించినట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం వరకు మూసివేశారు.