మిక్సీ జార్‌లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, రెండు స్పూన్ల గసగసాలు, రెండు లవంగాలు, నాలుగు-ఐదు యాలకులు, ఒక చిన్న చెక్క ముక్క, ఏడు ఎనిమిది జీడిపప్పు వేసి నీటితో పేస్ట్‌గా రుబ్బాలి. స్టవ్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.