నెల్లూరులోని ఏసీ నగర్‌లో రూ.10 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆధునికీకరణ పనులకు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని, 2028 చివరి నాటికి నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.