చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కాకా'. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.