రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. దీంతో సుమారు ఆరు లక్షల మంది విద్యుత్ సరఫరా కోల్పోయారు. కీవ్, ఖార్కివ్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగాయని జెలెన్‌స్కీ చెప్పారు. తాజా దాడుల్లో ముగ్గురు మరణించారు, 21 మంది గాయపడ్డారు. రాత్రికి రాత్రే రష్యా 39 బాలిస్టిక్ క్షిపణులు, 128 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ 4 క్షిపణులు, 115 డ్రోన్లను కూల్చివేసింది.