విజయనగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ–గురజాడ, విశాఖపట్నానికి చెందిన శ్రీయాన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అడ్వైజరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కీలక ఎంవోయూ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత, AI, రోబోటిక్స్‌, ESG, కార్బన్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లు అందించబడతాయి.