పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న ఆక్వాఎక్స్ ఇండియా-2026 ఎక్స్‌పోను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సందర్శించారు. ఆధునిక సాంకేతిక, పర్యావరణహిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాలని, దేశ ఆదాయంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.